పల్లె పండుగతో గ్రామీణాభివృద్ధి: కోవూరులో రోడ్డు పనులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి శంకుస్థాపన

రిపోర్టర్: సురేష్ స్థలం: కోవూరు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామీణాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. పల్లె పండుగలో భాగంగా కొడవలూరు మండలానికి రెండు కోట్ల ఆరు లక్షల రూపాయల వ్యయంతో యాభై ఆరు అభివృద్ధి పనులు మంజూరైనట్లు ఆమె తెలిపారు. బుధవారం కొడవలూరు మండలం తాటాకులదిన్నె ఎస్సీ కాలనీలో పది లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి వివరాలు వెల్లడించారు.