ఒక్క వ్యక్తి చేతిలో ఇంత పవర్ ఉండటం ప్రమాదకరమా?

రిపోర్టర్: సతీష్ స్థలం: World

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అపారమైన సాంకేతిక శక్తిపై ఆస్కార్ విజేత అలెక్స్ గిబ్నీ సంచలన డాక్యుమెంటరీని రూపొందించారు. రాకెట్లు, శాటిలైట్లు, సోషల్ మీడియా, ఏఐ వంటి కీలక వ్యవస్థలన్నీ ఒకే వ్యక్తి నియంత్రణలో ఉండటం భవిష్యత్తుకు ఎంతవరకు సురక్షితమనేది ఈ డాక్యుమెంటరీ ప్రధాన చర్చ. మస్క్ సామ్రాజ్య విస్తరణ కేవలం వ్యాపారమా లేక ప్రపంచాన్ని శాసించే శక్తిగా మారుతోందా అనే కోణంలో ఈ విశ్లేషణ సాగుతోంది.