యైటర్ నోయెల్ క్లార్క్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు

రిపోర్టర్: శివ స్థలం: London

బ్రిటన్ నటుడు, చిత్రనిర్మాత నోయెల్ క్లార్క్ లండన్ కోర్టులో హాజరై తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించినట్లు అధికారులు తెలిపారు. రెండు లైంగిక వేధింపుల కేసులు సహా మొత్తం ఆరు ఆరోపణలపై ఆయన నిర్దోషిగా వాదించారు. వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ అనంతరం ఆయనకు బెయిల్ మంజూరైందని, నవంబర్ పద్దెనిమిదో తేదీన సౌత్వార్క్ క్రౌన్ కోర్టులో తిరిగి హాజరుకావాల్సి ఉందని న్యాయ వర్గాలు వెల్లడించాయి.