ప్రయాణికులకు తీపి కబురు: పండుగల వేళ ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే
రిపోర్టర్: రాజేష్
స్థలం: సికింద్రాబాద్
దసరా, దీపావళి పండుగల వేళ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చిందని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి విశాఖపట్నం, చెన్నై, నాగర్‌కోయిల్ మార్గాలలో ఈ సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు ఐఆర్సిటిసి ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.