తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాలి: సీఎం రేవంత్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

తుమ్మిడిహట్టి బ్యారేజ్ పై మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జూబ్లీ హిల్స్ నివాసంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్ లో ఉంచుతామని, మహారాష్ట్ర అధికారులు కోరిన సమచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని సీఎం అధికారులకు సూచించారు.