భోపాల్‌లో ఆర్టీఓ మహిళా అధికారి దారుణ హత్య ఆపై వ్యక్తి ఆత్మహత్య

రిపోర్టర్: విజయ్ స్థలం: భోపాల్

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఖజురి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దాతియాలో ఆర్టీఓ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ముప్పై ఆరేళ్ల మీనాక్షి గోఖలేను గుర్తుతెలియని వ్యక్తి సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమెకు పరిచయమున్న పవన్ కుమార్ ద్వివేది సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి తన మూడేళ్ల కూతురు, మరో మహిళా స్నేహితురాలితో కలిసి మీనాక్షి పవన్ ఇంటికి వెళ్లగా ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.