కేవీఎస్, ఎన్వీఎస్ టీచర్ పోస్టుల టైర్-2 ఫలితాలు విడుదల

రిపోర్టర్: సురేష్ స్థలం: India

కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయాల్లోని టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి టైర్-2 ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. పీజీటీ, టీజీటీ, పీఆర్టీ విభాగాల్లోని పలు పోస్టులకు పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి ఫలితాలను చూసుకోవచ్చు. ఇంటర్వ్యూలు, స్కిల్ టెస్టులకు ఎంపికైన వారి వివరాలు, తదుపరి ప్రక్రియకు సంబంధించిన సమాచారం అభ్యర్థుల లాగిన్ ఐడీలలో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ ప్రాధాన్యతలను గడువులోగా నమోదు చేసుకోవాలని బోర్డు సూచించింది.