'ఆమె గాత్రం దైవిక అనుభూతి': ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతిలో కంటతడిపెట్టిన నిర్మలా సీతారామన్

రిపోర్టర్: మహేష్ స్థలం: బెంగళూరు

బెంగళూరులో జరిగిన భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి వేడుకల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడిపెట్టారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె, సుబ్బులక్ష్మి సంగీత ప్రయాణాన్ని మరియు కర్ణాటక సంగీత జగత్తుకు ఆమె అందించిన అమూల్యమైన సేవలను స్మరించుకుంటూ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో సుబ్బులక్ష్మి చేసిన కృషి చిరస్మరణీయమని, ఆమె నిరాడంబర జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి ప్రశంసించారు.