మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

రిపోర్టర్: గోపి స్థలం: மகாராஷ்டிரா

మహారాష్ట్రలోని గొండియా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. వేగంగా వస్తున్న ట్రక్కు, బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రాణనష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.