మారిషస్‌లో ఘనంగా భగవద్గీత ఆంగ్ల ఆడియో ఆల్బమ్ లోకార్పణం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: మారిషస్
ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకులు డా. గజల్ శ్రీనివాస్ రూపొందించిన శ్రీమద్భగవద్గీత ఆంగ్ల ఆడియో ఆల్బమ్‌ను మారిషస్ రాష్ట్రపతి శ్రీ ధరమ్‌బీర్ గోకుల్ దంపతులు మారిషస్‌లోని శ్రీ హరిహర దేవస్థానం ప్రాంగణంలో ఘనంగా లోకార్పణం చేశారు. ఈ ఆల్బమ్‌లో భగవద్గీతలోని మొత్తం 700 శ్లోకాలను గజల్ శ్రీనివాస్ స్వరపరచి గానం చేయగా, ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు మరియు ప్రముఖులు హాజరై భారతీయ ఆధ్యాత్మిక సంపదను కొనియాడారు.