కేజీబీవీలలో వేయికి పైగా నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఖాళీగా ఉన్న వెయ్యికి పైగా నాన్ టీచింగ్ పోస్టులను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పారదర్శక విధానంలో థర్డ్ పార్టీ ఏజెన్సీని ఎంపిక చేసేందుకు టెండర్ ప్రక్రియను ప్రారంభించారు. ఎంపికైన అభ్యర్థులకు విధులను బట్టి నెలకు పన్నెండు వేల నుండి పద్దెనిమిది వేల రూపాయల వరకు వేతనం చెల్లించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.