కార్పొరేట్ ఉద్యోగ ఇంటర్వ్యూలో విచిత్ర అనుభవం: మహిళకు హెచ్ఆర్ వింత ప్రశ్న

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

కార్పొరేట్ ఉద్యోగ ఇంటర్వ్యూలో హెచ్ఆర్ ప్రతినిధి తనకు ఎదురైన వ్యక్తిగత ప్రశ్నపై శతక్షి ద్వివేది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వివాహం చేసుకున్న తనకు త్వరలో పిల్లలను కనే ప్రణాళిక ఏమైనా ఉందా అని హెచ్ఆర్ ప్రశ్నించినట్లు ఆమె వెల్లడించారు. మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పుకునే కంపెనీల తీరుకు ఇది అద్దం పడుతోందని, నియామక ప్రక్రియలో ఇలాంటి అనుచిత ప్రశ్నలు ఎదురుకావడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.