బెంగళూరులో భారీ నకిలీ మందుల రాకెట్ గుట్టు రట్టు
రిపోర్టర్: శివ
స్థలం: Bengaluru
కోట్ల రూపాయల నకిలీ మందుల కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అజర్బైజాన్లో అరెస్టైన మెడికల్ రిప్రజెంటేటివ్ ఆర్ ప్రశాంత్ బాబును సోమవారం తెల్లవారుజామున బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 18న తావరెకెరేలో ఐదు కోట్ల విలువైన నకిలీ మందులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రధాన సూత్రధారి వీరేశ్ కుమార్ జైన్‌తో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.