హైందవ టీజర్ విడుదల: నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు మిస్టికల్ థ్రిల్లర్
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన హైందవ సినిమా నవంబర్ 27న విడుదల కానుందని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. రంగాపురం గ్రామంలోని పురాతన ఆలయంలో విగ్రహాలు మాయం కావడం, అదే సమయంలో హత్య జరగడం వంటి ఆసక్తికర అంశాలతో ఈ మిస్టికల్ డివోషనల్ థ్రిల్లర్ తెరకెక్కిందని చిత్ర యూనిట్ పేర్కొంది.