అధిక లాభాల పేరుతో సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక

రిపోర్టర్: విజయ్ స్థలం: ఏలూరు

అధిక లాభాల ఆశ చూపిస్తూ తక్కువ పెట్టుబడితో లక్షలు ఇస్తామనే ఇన్వెస్ట్‌మెంట్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు పోలీసులు హెచ్చరించారు. కేవలం వెయ్యి రూపాయలు పెడితే లక్షలు వస్తాయనే ఆఫర్లను అసలు నమ్మవద్దని సూచించారు. తొందరపెట్టి పెట్టుబడులు పెట్టించుకోవడం సైబర్ మోసానికి సంకేతమని తెలిపారు. ఒకవేళ ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు స్పష్టం చేశారు.