తాగునీరు లేక చుక్కల కోసం అల్లాడుతున్న పల్లెసీమల జనం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని జియాగూడ కుర్మ బస్తీలో నల్లా నీరు నల్లగా, దుర్గంధంతో వస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టాకూర్ పంచ్ ప్రాంతంలో సుమారు 20 వేల మంది నివసిస్తుండగా, అధికారులు మురుగు నీటి సరఫరాను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే కలుషిత నీరు వస్తోందని, ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని బస్తీవాసులు డిమాండ్ చేస్తున్నారు.