ఉక్రెయిన్ దాడిలో రష్యన్ జనరల్ మృతి!

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: World

ఉక్రెయిన్ జరిపిన భీకర దాడుల్లో రష్యాకు చెందిన 51వ కంబైండ్ ఆర్మ్స్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ సెర్గీ మిల్చాకోవ్ మరణించారు. డొనెట్స్క్ ప్రాంతంలోని రష్యన్ సైనిక కమాండ్ పోస్ట్ పై జరిగిన ఈ క్షిపణి దాడిలో పలువురు సీనియర్ అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన రష్యా సైన్యానికి భారీ ఎదురుదెబ్బగా మారింది.