మేయర్ కటారి హేమలతను మనస్ఫూర్తిగా అభినందించిన ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు
రిపోర్టర్: Bharath
స్థలం: చిత్తూరు
చిత్తూరు నగర మేయర్గా ఘన విజయం సాధించిన కటారి హేమలతకు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు మరియు కార్యకర్తలకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నగర సమగ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.