ప్యాపిలిలో వైయస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం

రిపోర్టర్: గోపి స్థలం: ప్యాపిలి

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్యాపిలి మండలంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కీలక సమావేశంలో మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాపిలి మండల కన్వీనర్ పొద్దోటి కృష్ణమూర్తి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మెట్టుపల్లి వెంకటేశ్వర రెడ్డి, సీనియర్ అడ్వకేట్లతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.