నెల్లూరులో పొట్టేపాలెం బ్రిడ్జి నిర్మాణంతో తీరనున్న ప్రయాణ ఇబ్బందులు
రిపోర్టర్: మహేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు గ్రామీణ మండలంలో నరసింహకొండ మార్గంలో ఉన్న పొట్టేపాలెం చెరువు కలుజుపై వంతెన నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఇక్కడ నిత్యం నీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వారు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావించడంతో నిధులు మంజూరయ్యాయి. రూ.6.54 కోట్ల వ్యయంతో డిజైన్ మార్పులతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. చిన్నపాటి పనులు మినహా మిగతా పనులన్నీ పూర్తి కావడంతో త్వరలో ప్రారంభం కానుంది.