విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడిన ఘటనపై మంత్రి సమీక్ష

రిపోర్టర్: నరేష్ స్థలం: Vijayawada

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారని అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మతుల కారణంగా భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆయన పేర్కొన్నారు. భక్తుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రక్షణ చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.