రాప్తాడు రంపపు దాడి ఘటన: విద్యార్థిని గోపిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన

రిపోర్టర్: కిరణ్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ స్కూల్ లో జరిగిన రంపపు దాడిలో తీవ్రంగా గాయపడిన టెన్త్ విద్యార్థిని గోపిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. బెంగళూరు మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలిక స్పందిస్తోందని, నేడు సాయంత్రం వెంటిలేటర్ సపోర్ట్ తొలగించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. తోటి విద్యార్థినిని రక్షించే ప్రయత్నంలో గాయపడిన లక్ష్మికి కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నామని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు.