యువతలో లింగ సమానత్వ స్పృహ పెరగాలన్న నీడ్స్ సంస్థ
రిపోర్టర్: Raju Reporter
స్థలం: ఆత్మకూర్
మండలంలోని తిమ్మాపురం గ్రామంలో నీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో యువతీ యువకులకు లింగ సమానత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కానుగంటి శ్రీశైలం మాట్లాడుతూ దేశాభివృద్ధికి లింగ సమానత్వం ఎంతో కీలకమన్నారు. యువత సామాజిక మార్పుకు ప్రధాన శక్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. యువతులు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, స్థానిక యువకులు పాల్గొన్నారు.