విజయవాడ శాప్ కార్యాలయ దాడి ఘటనలో నిందితుల గుర్తింపు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Vijayawada
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద జరిగిన దాడి మరియు అల్లర్ల ఘటనపై పోలీసులు సీసీ కెమెరాలు, సోషల్ మీడియా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనలో మొత్తం 260 మందిని గుర్తించగా, వారిలో 45 మంది రౌడీషీటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు తేల్చారు. ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేయగా, వైఎస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాశ్, పేర్ని కిట్టు, జక్కంపూడి రాజా తదితరులను నిందితులుగా చేర్చారు.