గల్ఫ్ ఉపాధి మోసాలు: నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న నకిలీ ఏజెంట్లు

రిపోర్టర్: హరి స్థలం: నిజామాబాద్

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని గల్ఫ్ ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారని గల్ఫ్ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు గుప్పిస్తూ అమాయకుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. నకిలీ వీసాలతో విదేశాలకు పంపి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ దందాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.