తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: నెల్లూరు జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో తుఫాను ముప్పు పొంచి ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. కావలి-కందుకూరు ప్రాంతం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఆదివారం మీడియాతో తెలిపారు. గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని కోరారు.