ఇట్లు అర్జున ట్రైలర్ రిలీజ్: యంగ్ హీరోను అభినందించిన ఎన్టీఆర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
అనీష్ హీరోగా నటిస్తున్న ఇట్లు అర్జున సినిమా ట్రైలర్ను ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. మొదటి చిత్రంలోనే మాటలు రాని భిన్నమైన పాత్రను ఎంచుకోవడం అనీష్ ధైర్యానికి నిదర్శనమని ఎన్టీఆర్ ప్రశంసించారు. మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం నవంబర్ పదమూడో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.