పెద్దమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు: అక్టోబర్ 11 నుంచి వేడుకలు ప్రారంభం

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని ప్రముఖ జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు పది రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయని వారు పేర్కొన్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని, ప్రత్యేక అలంకరణలతో పూజలు అందుకోనున్న అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.