యువ అథ్లెట్ల చదువు కోసం అమెరికన్ టెన్నిస్ స్టార్ కోకో గఫ్ భారీ విరాళం

రిపోర్టర్: గోపి స్థలం: అమెరికా

అమెరికన్ టెన్నిస్ స్టార్ కోకో గఫ్ విద్యార్థుల అభ్యున్నతి కోసం యునైటెడ్ నీగ్రో కాలేజ్ ఫండ్ కు లక్షా యాభై వేల డాలర్ల భారీ విరాళాన్ని అందజేసినట్లు సంస్థ అధికారులు తెలిపారు. టెన్నిస్ క్రీడలో రాణిస్తూనే ఉన్నత విద్యనభ్యసించే యువ అథ్లెట్లకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఆమె ఈ సహాయాన్ని అందించారు. ఈ విరాళం ద్వారా విద్యార్థులు తమ చదువును, క్రీడలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడానికి అద్భుతమైన అవకాశం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.