మామిళ్లపల్లిలో తాగునీటి పథకానికి రూ.1.35 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం

రిపోర్టర్: రాజేష్ స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని మామిళ్లపల్లిలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ మరియు పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా ఈ గ్రామంలో రూ.1.35 కోట్ల భారీ నిధులతో ప్రత్యేక తాగునీటి పథకం పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షిత తాగునీటిని నిరంతరం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.