అక్టోబర్లో మార్కెట్లోకి వస్తున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

అక్టోబర్ నెలలో పలు ప్రముఖ కంపెనీల నుంచి శక్తివంతమైన ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి రానున్నట్లు టెక్ నిపుణులు తెలిపారు. ఈ పండుగ సీజన్లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివో, ఒప్పో, మోటోరోలా వంటి బ్రాండ్లు సరికొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. భారీ బ్యాటరీలు, అత్యాధునిక ప్రాసెసర్లు మరియు మెరుగైన కెమెరా సెటప్లతో ఈ ఫోన్లు రానుండటంతో టెక్ ప్రియుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.