ఫ్లైదుబాయ్ పైలట్ సాహసం: ప్రధాని మోదీతో మాట్లాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

గగనతలంలో తనపై దాడి జరిగినా ప్రాణాలను పణంగా పెట్టి విమానాన్ని కాపాడుకున్న ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. యూఏఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పైలట్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ ఘటనపై విదేశీ అధికారులతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ దర్యాప్తునకు ఆదేశించారు.