తమిళనాడు తరహా చట్టం తేవాలి: హైకోర్టును కోరిన విశ్రాంత న్యాయమూర్తి ఈశ్వరయ్య
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించేందుకు తమిళనాడు తరహా చట్టాన్ని తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య కోరారు. ఈ మేరకు అఖిల భారత బీసీ సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆలా వెంకటేశ్వర్లు వేసిన వ్యాజ్యంలో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సోమవారం జరిగిన విచారణలో ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.