సచిన్ రికార్డును బ్రేక్ చేసిన జింబాబ్వే ఆటగాడు
రిపోర్టర్: అశోక్
స్థలం: World
జింబాబ్వే వెటరన్ క్రికెటర్ బ్రెండన్ టేలర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బరిలోకి దిగడం ద్వారా, అత్యధిక కాలం వన్డే క్రికెట్ ఆడిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును టేలర్ అధిగమించాడు. టేలర్ వన్డే కెరీర్ కాలం ప్రస్తుతం 22 సంవత్సరాల నాలుగు నెలలకు చేరింది. సచిన్ కెరీర్ 22 సంవత్సరాల మూడు నెలల పాటు సాగింది.