దళితుల ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్న బీఆర్ఎస్ నేతల కర్కశ వైఖరి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పెద్దపల్లి
ఎమ్మెల్సీ మధు దళిత వర్గాలపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తుందో లేదో స్పష్టం చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటంపై బీఆర్ఎస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని, సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన తీర్పుతో సమాధానం చెబుతారని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.