మతాల పేరుతో రాజకీయాలు చేసేవారికి ప్రజలే తగిన తీర్పు చెబుతారు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పెద్దపల్లి
కులాలు మరియు మతాల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా హితవు పలికారు. ఢిల్లీలో ప్రసంగం తర్వాత శుద్ధీకరణ పూజలు చేయడంపై బీజేపీ మరియు ఆ విధానాలను సమర్థిస్తున్న బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను తక్షణమే మానుకోవాలని, సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన తీర్పుతో బుద్ధి చెబుతారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ హెచ్చరించారు.