స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయవాడ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని మంత్రి సవిత స్పష్టం చేశారు. విజయవాడ గొల్లపూడి బీసీ భవన్లో కార్పొరేషన్ల ఛైర్మన్లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా కోర్టుల్లో నిలబడేలా బీసీ రక్షణ చట్టం తెస్తున్నామని చెప్పారు. బీసీలను దూషిస్తే కఠిన శిక్షలుంటాయని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని హెచ్చరించారు.