వివాహ ఫోటోగ్రఫీలో లోపం: ఫోటోగ్రాఫర్ కు రూ. 35 వేల జరిమానా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హసన్

పెళ్లికి తానే స్వయంగా ఫోటోలు తీస్తానని నమ్మించి, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వేరేవారిని పంపిన ఫోటోగ్రాఫర్ కు వినియోగదారుల కమిషన్ గట్టి షాకిచ్చింది. బాధితురాలికి ముప్ పై ఐదు వేల రూపాయల పరిహారం చెల్లించాలని హాసన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ స్పష్టం చేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకే ఈ తీర్పు వెలువరించినట్లు అధ్యక్షురాలు చంచల సీఎం తెలిపారు.