ముడి చమురు ధరల భగభగ: ఆసియా మార్కెట్లలో మళ్లీ ఎగబాకిన రేట్లు

రిపోర్టర్: సతీష్ స్థలం: Global

అమెరికా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగినట్లు ఇంధన నిపుణులు తెలిపారు. ఇరాన్ లోని కెస్మ్ ద్వీపంపై అమెరికా దళాల దాడులతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగి బ్యారెల్ వంద డాలర్లకు పైగా ట్రేడవుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు అంతరాయం కలుగుతుందని, దీనివల్ల రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేశారు.