కొండాపూర్ లో విషాదం: అప్పుల బాధతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణం

రిపోర్టర్: సతీష్ స్థలం: కొండాపూర్

క్రెడిట్ కార్డు అప్పు చెల్లించాలంటూ సంస్థ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ తో తీవ్ర మనస్తాపానికి గురై ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి వెల్లడించారు. మల్కాపూర్ లోని చింతల్ రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన మంగలి వీరేశం అప్పుల బాధ భరించలేక ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడి తండ్రి రామచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.