డీఎస్సీ అక్రమాలపై యూటర్న్.. ఏబీఎన్ తీరుపై విమర్శలు

రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి స్థలం: రాష్ట్రం

డీఎస్సీ అక్రమాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వ్యవహరిస్తున్న తీరుపై వైయస్ఆర్సీపీ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణ ముడియాల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకే రోజులో మూడు రకాల కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

మధ్యాహ్నం అక్రమాలు జరిగాయని చెప్పి, సాయంత్రానికి చిన్న పొరపాట్లు అని, రాత్రికి డీఎస్సీ నిర్వహణే గొప్పని యూటర్న్ తీసుకోవడం వెనుక ప్యాకేజీ ఉందా అని ఆయన ప్రశ్నించారు. అక్రమాలు బయటపడుతున్నా మంత్రి నారా లోకేష్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు.