ప్రజల కష్టాల్లో అండగా నిలవాలన్న షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
షాద్నగర్ పట్టణంలోని 13వ వార్డులో నిర్వహించిన ఉచిత మంచినీటి క్యాన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని సుమారు వెయ్యి కుటుంబాలకు తాగునీటి క్యాన్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాల్లో అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్థానిక కౌన్సిలర్ రిజ్వానా బేగం, ముబారక్ అలీ ఖాన్ దంపతులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.