వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ దర్యాప్తు తీవ్రతరం

రిపోర్టర్: సునీల్ స్థలం: కడప

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ఈడీ రెండో నిందితుడు సునీల్‌ యాదవ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. హత్యకు రూ.40 కోట్ల సుపారీ చేతులు మారిందన్న సీబీఐ ఆరోపణల నేపథ్యంలో ఆర్థిక మూలాలను వెలికితీసేందుకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు.