తిరుమలలో మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ అంజిప్రసాద్

రిపోర్టర్: శివ స్థలం: Tirumala

తిరుమలలో మతిస్థిమితం కోల్పోయి, తలకు గాయంతో ఇబ్బంది పడుతున్న కర్ణాటకకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తిని తిరుమల 2వ టౌన్ హెడ్ కానిస్టేబుల్ అంజిప్రసాద్ గుర్తించారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, అతనికి దుస్తులు ఇచ్చి, కుటుంబ సభ్యులను సంప్రదించి సురక్షితంగా అప్పగించారు. పోలీసుల ఈ మానవీయ కోణాన్ని పలువురు అభినందిస్తున్నారు.