విశాఖలో ప్రశాంతంగా జీవీఎంసీ పోలింగ్: భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన నగర సీపీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగరంలో జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ అత్యంత ప్రశాంతంగా కొనసాగుతోందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు VizagCityPolice వెల్లడించారు. సున్నితమైన మరియు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. ఓటు హక్ కు వినియోగించుకునేందుకు విచ్చేసిన వృద్ధులు అలాగే దివ్యాంగులకు ప్రత్యేక చేయూతనందిస్తూ, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోలీసులు అన్ని వసతులు కల్పించారని ఆయన పేర్కొన్నారు.