ఐదో రోజుకు చేరుకున్న రాజోలు వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం

రిపోర్టర్: K NAGA SRINU స్థలం: రాజోలు

రాజోలు మండలంలో వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీరు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు వెనక్కి తగ్గేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ సమ్మె కారణంగా మండలంలో పలు రెవెన్యూ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు, వీఆర్ఏలు పాల్గొని ప్రభుత్వ తీరుపై తమ నిరసనను వ్యక్తం చేశారు.