కేంద్ర మాజీ మంత్రి సుదర్శన్ నాచియప్పన్ కన్నుమూత
రిపోర్టర్: రమేష్
స్థలం: తమిళనాడు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుదర్శన్ నాచియప్పన్ అనారోగ్యంతో గురువారం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో తమిళనాడులోని తన స్వగృహంలో కన్నుమూసిన ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన శివగంగై నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికై, యూపీఏ హయాంలో కేంద్ర సహాయ మంత్రిగా సేవలందించారు.