బాపట్ల జిల్లాలో కోడిపందేలు స్థావరాలపై పోలీసుల దాడులు

రిపోర్టర్: హరి స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు కోడిపందేలు, పేకాట స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇటువంటి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.