ఓటర్లకు నేరుగా బిఎల్ఓలు వెళ్లాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బిఎల్ఓలు స్వయంగా ఇళ్లకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు సేకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ సర్వేలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. ఓటర్లు లైన్లలో నిలబడి ఇబ్బందులు పడకుండా చూసేందుకే ఈ కీలక మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. అధికారుల మధ్య సమన్వయం కోసం కూడా ఈసీ అత్యవసర భేటీ నిర్వహించింది.