నాచారంలో దారుణం: విద్యార్థి చెవిటిపోయేలా కొట్టిన శ్రీ చైతన్య వార్డెన్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని నాచారంలో శ్రీ చైతన్య పాఠశాల హాస్టల్లో ఎనిమిదో తరగతి విద్యార్థిపై వార్డెన్ చందు అమానుషంగా దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఫోన్లో మాట్లాడాడనే చిన్న కారణంతో వార్డెన్ విచక్షణారహితంగా కొట్టడంతో విద్యార్థి చెవి కర్ణభేరి పగిలిపోయి యాభై శాతం వినికిడి లోపం ఏర్పడిందని వైద్యులు ధ్రువీకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.